యంగ్ హీరో నాగ శౌర్య తన టీమ్ తో కలిసి రేపు వైజాగ్ లో సందడి చేయనున్నాడు. తన లేటెస్ట్ మూవీ అశ్వథామ ప్రచారంలో భాగంగా రేపు వైజాగ్ 11 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకుంటారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు దువ్వాడ విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులతో… 6 గంటలకు గుసక్ కార్నివాల్ గీతం కాలేజ్, రిషి కొండ విద్యార్థులతో కలిసి సందడి చేయనున్నారు. దర్శక నిర్మాతలతో పాటు, హీరోయిన్ మెహ్రిన్ పిర్జా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.
వచ్చే నెల 31న అశ్వథామ విడుదల నేపథ్యంలో మూవీ ప్రచార జోరు పెంచారు. సోషల్ ఇష్యూస్ పై స్పందిచే యువకుడిగా నాగ శౌర్య ఈ చిత్రంలో కనిపించనున్నారు. కమర్షియల్ అంశాలతో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా అశ్వథామ తెరకెక్కింది. నూతన దర్శకుడు రమణ తేజ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపూరి నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల్ మ్యూజిక్ అందిస్తున్నారు.


