తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ షూటింగ్లో ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపిస్తాడనే వార్తలు వినబడుతూ వచ్చాయి.
కార్తికేయ గతంలో నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో విలన్ రోల్ చేసి ఉండటంతో అంతా ఈ వార్తలు నిజమనే అనుకున్నారు. కానీ కార్తికేయ ఇందులో నటించట్లేదని తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి.
నిర్మాత బోనీ కపూర్ వేరొకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇకపోతే ఈ చిత్రంలో యామీ గౌతమ్ ప్రధాన కథానాయకిగా కన్ఫర్మ్ కాగా ఇంకొక పాత్రకు గోవా బ్యూటీ ఇలియానాను అనుకుంటున్నట్టు తెలుస్తోంది.


