అజిత్ ‘వాలిమై’ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

అజిత్ ‘వాలిమై’ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

Published on Dec 19, 2019 12:26 AM IST

yami

సూపర్ స్టార్ అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ వాలిమై. దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం అజిత్ కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. ఆయన కొన్ని కఠిన కసరత్తులు చేయడంతో పాటు బరువు కూడా తగ్గారు. ఐతే ఈ మూవీ కొరకు హీరోయిన్ ఫిక్స్ చేశారట.

బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న హీరోయిన్ యామి గౌతమ్ అజిత్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక కాబడ్డారు. ఈ ఏడాది యామి గౌతమ్ నటించిన ఉరి, బాలా చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగులో యామి గౌతమ్ నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు