నిన్న రాత్రి సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు. నేడు సాయంత్రం 5:04నిమిషాలకు మహేష్ సినిమాకు సంబంధించిన ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్ రానుందని వారు చెప్పడం జరిగింది. మరి మహేష్ అభిమానులను అంతటి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఎక్సయిటింగ్ అప్డేట్ ఏమై ఉంటుంది అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది.
ఇంకా మరో ఇరవై రోజులలో సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో జరుపనున్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసే విశిష్ట అతిథి గురించి తెలియజేయనున్నారా.. లేక సరిలేరు నీకెవ్వరు చిత్ర ట్రైలర్ విడుదల గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వనున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఈ సారి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరు లేదా రామ్ చరణ్ హాజరయ్యే అవకాశం కలదని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ సరసన రష్మిక మందాన నటించగా వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


