పూరి… కొడుకు కోసం పాట రాశాడట..!

పూరి… కొడుకు కోసం పాట రాశాడట..!

Published on Dec 21, 2019 1:19 PM IST

romantic 1

ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. దర్శకుడు అనిల్ పాదూరి ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే ఘాడమైన ప్రేమతో కూడుకున్న సీరియస్ లవ్ స్టోరీ గా దర్శకుడు అనిల్ పాదూరి తీర్చిదిద్దుతున్నారు.కాగా నేడు ఈ మూవీ నుండి సాయంత్రం 5:00 గంటలకు నువ్వూ నేనూ ఈ క్షణం.. అనే సాంగ్ విడుదల కానుంది.

ఐతే విశేషం ఏమిటంటే దర్శకుడు పూరి స్వయంగా ఈ పాటను రాశారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మి స్వయంగా పంచుకున్నారు. అద్భుతమైన కథలు, ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే తో పాటు, దిమ్మతిరిగే వన్ లైన్ పంచ్ లు రాయడంలో దిట్టగా పేరున్న పూరి, కొడుకు కోసం లిరిసిస్ట్ గా కూడా మారాడు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా… పూరి కనెక్టస్స్ బ్యానర్ పై పూరి మరియు ఛార్మి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు