ప్రభాస్ సాగరతీరంలో స్థలం కొంటారట..?

ప్రభాస్ సాగరతీరంలో స్థలం కొంటారట..?

Published on Dec 22, 2019 1:15 AM IST

Prabhas1

ప్రభాస్ ఓ విలాసవంతమైన నివాస స్థలం కొనాలనుకుంటారట. చెన్నై లోని సముద్ర తీర సమీపాన గల ఒక స్థలంపై ప్రభాస్ మనసు పారేసుకున్నారట. ఆ స్థలాన్ని ఆయన దక్కించుకొనే యోచనలో ఉన్నారని సమాచారం.అది చెన్నై లోని ఈ సి ఆర్ రోడ్ నందు గల ఒక విలాస విలాసవంతమైన స్థలం అని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. 1960ల నాటి పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రం తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం జాన్. సాహో విషయంలో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురైన నేపథ్యంలో జాన్ సినిమాతో గట్టిగా కొట్టాలని ప్రభాస్ చూస్తున్నాడు. జాన్ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ జాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు