నైజాంలో ప్రతిరోజూ పండుగే కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు 1.25 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు కూడా దూకుడు కొనసాగించింది. రెండవ రోజు ఈ మూవీ 1.20 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను ప్రతిరోజూ పండుగే మూవీ 2.45 కోట్ల షేర్ తో స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. ఇక వారాంతానికి చివరి రోజైన ఆదివారం ఈ మూవీ వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే అంశాలతో తెరకెక్కిన ప్రతిరోజూ పండుగే చిత్రం సాయిధరమ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది.
దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ కీలకపాత్రలు చేశారు. థమన్ స్వరాలు సమకూర్చారు.


