స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ మీడియా పై చర్యల పట్ల ఆవేదన చెందారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన భాధను వ్యక్త పరిచారు. విషయంలోకి వెళితే గత రెండు రోజులుగా టాలీవుడ్ లోని మరో ప్రముఖ యాంకర్ మరియు నటి నివాసంపై జీఎస్టీ దాడులు జరిగాయని వార్తలు వస్తున్నాయి. అనసూయ నివాసంపై కూడా ఇలాంటి దాడులు జరిగాయని వార్తలు రావడం జరిగింది. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజంగా జరిగిన సంఘటలను ప్రజలకు చేరవేయాల్సిన మీడియా ఊహాగానాలను ప్రచారం చేయడం తగదన్నారు. ఒకరి వ్యక్తిగత గుర్తింపు, వ్యక్తిత్వం దెబ్బతీసే ఇటువంటి ప్రచారాలు చేయవద్దని ఆమె మీడియాను కోరుకున్నారు.
కాగా అనసూయ మొదటిసారి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ కేటగిరిలో అవార్డు అందుకున్నారు. గత రాత్రి చెన్నై వేదికగా సౌత్ ఫిలిం ఫేర్ 2019 అవార్డ్స్ వేడుకలలో ఈ ప్రకటన చేశారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 22, 2019


