మూడు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేసిన హీరో

మూడు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేసిన హీరో

Published on Dec 23, 2019 12:54 PM IST

Aadhi

హీరో ఆది సాయికుమార్ గత కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. గత చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా విఫలమవడంతో నిరుత్సాహానికి గురయ్యారు ఆయన. అయితే అందులో నుండి తేరుకుని వరుసగా సినిమాలకు సైన్ చేశారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన సైన్ చేసిన వాటిలో మూడు కొత్త సినిమాల్ని ప్రకటించారు.

వాటిలో ఒకటి శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో రూపొందనున్న ‘శశి’ ఒకటి కాగా ఇంకొకటి జిబి.క్రిష్ణ డైరెక్షన్లో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి షూట్ మొదలుకానుంది. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మరుధురి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. వీటిలో ఎక్కువగా థ్రిల్లర్ జానర్లోనే సినిమాలే ఉండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు