క్రిస్మస్ విశెష్ చెప్పిన ఆర్ ఆర్ ఆర్ కొమరం భీమ్..!

క్రిస్మస్ విశెష్ చెప్పిన ఆర్ ఆర్ ఆర్ కొమరం భీమ్..!

Published on Dec 25, 2019 3:00 PM IST

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా క్రిస్మస్ విశెష్ చెప్పడం ద్వారా తన అభిమానులను ఆయన ఫిదా చేశారు. సోసిల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండని ఎన్టీఆర్ చాల ముఖ్యమైన సంధర్భాలలో మాత్రమే స్పందిస్తూ ఉంటారు. నేడు ఆయన క్రిస్మస్ పర్వదినం సంధర్భంగా సోషమ్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వైజాగ్ లో ఫుల్ స్వింగ్ లో నడుస్తుందని సమాచారం. గత కొద్దిరోజుల క్రితం ఈ షెడ్యూల్ నందు పాల్గొనడానికి ఎన్టీఆర్ అక్కడికి వెళ్లారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయనున్నామని రాజమౌళి గతంలో ప్రకటించారు.

తాజా వార్తలు