రీస్టార్ట్ కానున్న బెల్లంకొండ సినిమా

రీస్టార్ట్ కానున్న బెల్లంకొండ సినిమా

Published on Dec 26, 2019 12:00 AM IST

Sai Ganesh

బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఇంట్రడ్యూజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా ఒక పాట చిత్రీకరణను పూర్తిచేశారు టీమ్. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నారు.

ఈ షెడ్యూల్ జనవరి ఆరంభంలో మొదలుకానుంది. ఆ తర్వాత ఒక ఫారిన్ షెడ్యూల్ కూడా ఉంటుందట. ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు