ఇంతకీ పవన్ పింక్ రిమేక్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

ఇంతకీ పవన్ పింక్ రిమేక్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

Published on Dec 26, 2019 7:10 AM IST

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి సర్వం సిద్ధం. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రిమేక్ లో నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు కానీ.. పవన్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది జగమెరిగిన సత్యం. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతున్న పవన్ పరిస్థితులకు తగ్గట్టుగా తనకు సొసైటీలో పాజిటివ్ ఇమేజ్ డెవలప్ కావడానికి సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన పింక్ రీమేక్ ని ఎంచుకున్నారు. కథ రీత్యా తక్కువ రోజులలో షూటింగ్ పూర్తికావడానికి అవకాశం కూడా కలదు.

కాగా ఈ చిత్రం కొరకు పవన్ 50కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అలాగే పింక్ రిమేక్ కొరకు కేవలం 20 నుండి 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారట. దిల్ రాజు అంత పెద్ద రెమ్యూనరేషన్ పవన్ కి ఇచ్చినా తన లెక్కలు తనకి ఉన్నాయి. పింక్ రీమేక్ బడ్జెట్ లో 75శాతం పవన్ రెమ్యూనరేషన్ ఉంటుంది. అనగా పింక్ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ ఉండదు. పవన్ ఇమేజ్ రీత్యా కొన్ని మార్పులు చేసి ఒక హీరోయిన్ ని తీసుకున్నప్పటికీ ఆమె మహా అయితే ఒక పాట…కొన్ని సన్నివేశాలకు పరిమితం అవుతుంది.కాబట్టి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి స్టార్ట్ హీరోయిన్ ని తీసుకోకపోవచ్చు.

ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే ముగ్గురు అమ్మయిల రెమ్యూనరేషన్ కోటి రూపాయలకు మించడు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఫార్మ్ లో లేరు. ఈ ప్రాజెక్ట్ లో మంచి రెమ్యూనరేషన్ అందుకొనేది సంగీతం అందిస్తున్న థమన్ మాత్రమే. ఇక ఈ మూవీ చిత్రీకరణ అధిక భాగం కోర్ట్ రూమ్ లో నడుస్తుంది. కాబట్టి పవన్ కి యాభై కోట్లిచ్చినా ఈ చిత్ర బడ్జెట్ 75కోట్లకు మించకపోవచ్చు. పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో టాక్ ఎలా ఉన్నా..భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. కాబట్టి దిల్ రాజు పింక్ రిమేక్ తో లాభాలు గడించడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు