సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండగే వసూళ్ల జోరు కొనసాగుతుంది. వర్కింగ్ డే నిన్న గురువారం కూడా ఈచిత్రం నైజాంలో 84లక్షలు వసూలు చేసింది. మొత్తం 7.36 కోట్ల షేర్ తో మొదటివారం ముగించిన ఈ చిత్రం నెక్స్ట్ వీకెండ్ ముగిసే నాటికి నైజాంలో ధరమ్ తేజ్ హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం కలదు. నైజాంలో ఇప్పటివరకు ధరమ్ తేజ్ సుప్రీమ్ మూవీ 8.5 కోట్ల షేర్ తో అతని కెరీర్ బెస్ట్ గా కొనసాగుతుంది.
ప్రతిరోజూ పండగే చిత్రంతో పాటు విడుదలైన చిత్రాలు నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్ర వసూళ్లకు కలిసొస్తుంది. యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటించగా థమన్ సంగీతం అందించారు. సత్య రాజ్, రావు రమేష్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు.


