‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!

‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!

Published on Aug 9, 2026 7:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా పలు భారీ సినిమాలు లైనప్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీ కేవలం సినిమాల వరకే కాకుండా సినిమా ద్వారా నడిచే థియేటర్ మల్టిప్లెక్స్ బిజినెస్ లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ హైదరాబాద్ లో తనకి ఆసియన్ సంస్థతో కలిపి ‘ట్రిపుల్ ఏ’ సినిమాస్ మల్టిప్లెక్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సాలిడ్ విజువల్స్ అండ్ సౌండింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కి ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటైన వైజాగ్ లో కూడా ఇప్పుడు తన ట్రిపుల్ ఏ మల్టిప్లెక్స్ ని తీసుకొచ్చారు. అది కూడా ఇదే వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘జులాయి’ సినిమా విడుదల అయ్యిన డేట్ లోనే లాంచ్ చేయడం అనేది యాదృచ్చికం. అక్కడి ఇనార్బిట్ మాల్ లో మొత్తం 8 స్క్రీన్స్ తో దీన్ని తీసుకొచ్చారు. ఇక అందుకు సంబంధించిన శుభారంభం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా జరిగింది. అల్లు అర్జున్, తన తండ్రి అల్లు అరవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు