‘జబర్దస్త్’, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంధర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సుధీర్ కి హీరోగా మంచి చిత్రం అవుతుందని వారు చెప్పారు. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉంటుంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. రైతులకు, సాప్ట్‌వేర్ సుధీర్‌కు ఉన్న లింక్ ఏమిటి అనేది కథలో కీలక మలుపు అని వారుచెప్పుకొచ్చారు.


