ఎవరెన్ని రకాలుగా అనుకున్నా..ఎలాంటి ప్రశ్నలు అడిగిన తనదైన శైలిలో సూటిగా సమాధానాలు చెవుతారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వర్మ ప్రస్తుతం వివాదమే పెట్టుబడిగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా బ్యూటిఫుల్ అనే ఓ మూవీ చేశారు. పార్థ్, నైనా గంగూలీ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 1న గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ సమీపించడంతో ఆయన ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న వర్మను ఒకరు పెద్ద హీరోలతో చేసే ఆలోచన లేదా అడిగారు. దానికి వర్మ సమాధానంగా వాస్తవాలకు దగ్గరగా, విభిన్నమైన చిత్రాలు తీసే నాకు పెద్ద హీరోలతో సినిమాలు తీయడం చేత కాదు అన్నారు. పెద్ద హీరో సినిమా అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ అలాగే వారి ఫ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇలా అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ సంతృప్తి పరిచేలా సినిమా తీయడం నాకు కుదరదు అని ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.


