చిన్న సినిమాల్ని ప్రోత్సహించనున్న నిర్మాతలు !

చిన్న సినిమాల్ని ప్రోత్సహించనున్న నిర్మాతలు !

Published on Dec 29, 2019 3:00 AM IST

MathuVadalara

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనూహ్య ప్రేక్షకాదరణ లభిస్తోంది. పరిమిత వ్యయంతో, ఓ వినూత్నమైన ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా నిర్మాతలు రవిశంకర్, చెర్రి(చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు.

రవిశంకర్, చెర్రి మాట్లాడుతూ.. ‘మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి). మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తువదలరా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు