ప్రీ టీజరే ఇలా ఉంటే.. ఇక పాట

ప్రీ టీజరే ఇలా ఉంటే.. ఇక పాట

Published on Dec 29, 2019 7:05 PM IST

Ala Vaikunthapuramulo1

అల్లు అర్జున్, త్రివిక్రమ్ తమ ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి వరుస అప్డెట్స్ ఇస్తూ రెండు నెలలుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్, పాటలతోనే బోలెడంత పబ్లిసిటీ పొందిన ఈ సినిమా ఇప్పుడు పాటల టీజర్లను విడుదల చేస్తున్నారు. అందులో ‘సామజవరగమన’ సాంగ్ టీజర్ న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న రిలీజ్ కానుంది.

దీనికి శాంపిల్ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో పారిస్ లొకేషన్స్ తాలూకు రెండు మూడు షాట్స్ రెండు మూడు చూసేందుకు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. పైగా బన్నీ స్టైలిష్ లుక్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానులు టీజర్లోనే ఇంత మంచి స్టఫ్ ఉంటే ఇక పూర్తి పాట ఎంత గొప్పగా ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ‘సామజవరగమన’ పాట కోసమైనా సినిమా చూడాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఒక్క పాటతోనే బన్నీ, త్రివిక్రమ్, తమన్ సినిమాకు పూర్తి హైప్ ఇచ్చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు