తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. కంగనా విహార యాత్ర కోసం కచ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ఈ విహారయాత్రలోని ఫోటోలను కంగన సిస్టర్ రంగోలి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. ఇక మళ్లీ అమ్మ బయోపిక్ షూటింగ్ జనవరి మొదటివారంలో మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. అన్నట్టు తరువాత షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా, అరవింద్ స్వామి మీద ఎలెక్షన్ల సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇవి సినిమాలోనే కీలక సన్నివేశాలట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం కూడా సినిమాలో హైలెట్ చేస్తూ కథ ఉంటుందట. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి.


