సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ‘ప్రతిరోజూ పండుగే’ చిత్రం విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. డీసెంట్ టాక్ తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ఈ చిత్రం నిన్న ఆదివారం నాడు కూడా రూ .76 లక్షల షేర్ ను వసూళ్లు చేసింది. అలాగే శుక్రవారం నైజాంలో 41 లక్షలను, అలాగే శనివారం 60 లక్షల వసూళ్లును రాబట్టింది. ఓవరాల్ గా ఇప్పటివరకూ నైజాంలో రూ .9.08 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో సాయి తేజ్ కెరీర్ లోనే ఇవి బెస్ట్ కలెక్షన్స్. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి తేజ్ కెరీర్లో పెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది.
తేజ్ జర్నీకి మంచి బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా ఓవర్సీస్లో సైతం హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసి అతనికి మార్కెట్ ఏర్పడేలా చేసింది. డిస్ట్రిబ్యూటర్లలో సైతం తేజ్ మార్కెట్ స్థిరపడిందనే ఉద్దేశ్యాన్ని కలిగించింది. ఫన్ అండ్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ నటన హైలెట్ గా నిలిచింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.


