ఆసక్తికరంగా ఉండబోతున్న రవితేజ నెక్స్ట్ సినిమా

ఆసక్తికరంగా ఉండబోతున్న రవితేజ నెక్స్ట్ సినిమా

Published on Feb 12, 2020 3:00 AM IST

raviteja

ఇటీవలే ‘డిస్కోరాజా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన మాస్ మహారాజ రవితేజ తన తర్వాతి చిత్రాన్ని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజతో ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మ ఇటీవలే ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకున్నారు. రవితేజతో ఆయన చేయనున్న కొత్త చిత్రానికి కూడా మంచి కథను ఎంచుకున్నారట ఆయన.

తమిళంలో అరవింద స్వామి, త్రిష కలిసి నటించిన, ఇంకా విడుదలకాని ‘శతురంగ వెట్టై 2’ చిత్రం యొక్క స్టోరీ లైన్ ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దుతున్నారట. కథ ఫుల్ లెంగ్త్ ఎంటెర్టైనర్ లా ఉండేలా రాసుకుంటున్నారట రమేష్ వర్మ. ఈ సినిమా త్వరలోనే ఆరంభంకానుంది. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు