సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా

సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా

Published on Aug 7, 2026 4:02 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 07, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : లోకేష్ కనకరాజ్, వామికా గబ్బి, సంజన, గురు సోము సుందరం తదితరులు
దర్శకత్వం : అరుణ్ మాదేశ్వరన్
సంగీతం : అనిరుద్
నిర్మాణం : సన్ పిక్చర్స్
ఛాయాగ్రహణం: ముఖేష్ జి
కూర్పు : జీ కే ప్రసన్న

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

2011 చిత్తూరు ప్రాంతంలో ఓ క్రైమ్ ముఠా పోలీసుల వాహనాలపై దాడి చేసి అందులో ఆయుధాలు కాజేస్తారు. ఆ ముఠాలో ఒకడే దేవదాస్ (లోకేష్ కనకరాజ్). అక్కడ నుంచి ఆ కేసు మరో రకంగా మలుపు తిరుగుతుంది. ఆ దొంగతనం కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ని వీరు చంపడంతో డిపార్ట్మెంట్ కి పెద్ద తలనొప్పిగా మారడంతో వారు బోజరాజు (గురు సోమసుందరం) అనే పోలీస్ ఆఫీసర్ కి ఆ ముఠాను పట్టుకోవాలనే అసైన్మెంగ్ ఇస్తారు. అసలు ఈ ముఠా ఎందుకు పోలీస్ ని చంపారు? ఈ క్రమంలో దేవదాస్ ఏం కోల్పోయాడు? ఏం దక్కించుకున్నాడు? చివరికి పోలీసులు వీరిని పట్టుకున్నారా లేదా? దేవదాస్ లైఫ్ లోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు చంద్ర (వామికా గబ్బి) అలాగే పార్వతి (సంజన) ల పాత్రలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో దర్శకుడు తెరకెక్కించిన కథనం ఒకటైతే దీనికి సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన వర్క్ కూడా మరొకటి అని చెప్పాలి. ఇక వీటితో పాటుగా హీరోగా లోకేష్ కనకరాజ్ సాలిడ్ డెబ్యూని ఇచ్చాడని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ సినిమా విషయంలో చాలామందికి తక్కువ అంచనాలు, పలు సందేహాలు ఉండొచ్చు కానీ వాటిని బ్రేక్ చేసే విధంగా సాలిడ్ మూమెంట్స్ తో సినిమా వెళ్లిపోతుంది.

ముఖ్యంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్న పక్కా స్క్రీన్ ప్లే ఇందులో చూసే ఆడియెన్స్ కి అంతర్లీనంగా చేరుకొని ఆకట్టుకుంటుంది. ప్రతీ నాణేనికి రెండు వైపులు అన్నట్టుగా ప్రెజెంట్ చేసిన సీన్స్ ఇందులో సాలిడ్ ఎమోషన్స్ తో ఇంప్రెస్ చేసేలా అనిపిస్తాయి. ఇక వీటిలో హీరోగా లోకేష్ కనగరాజ్ సాలిడ్ డెబ్యూ అందించారు. ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యి ఒక మొరటు పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని తను అందించారు.

తనతో పాటుగా నటి వామికా గబ్బి సాలిడ్ రోల్ ని దక్కించుకుంది. కొంచెం సున్నితమైన రోల్ అయినప్పటికీ ఆమె తన పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసింది. కొన్ని సీన్స్ అయితే ఆమెపై సెకండాఫ్ లో బాగా వర్కవుట్ అయ్యాయి. వీరితో పాటుగా మరో హీరోయిన్ సంజన డీసెంట్ రోల్ దక్కించుకుంది. తనకి ఉన్నది లిమిటెడ్ స్క్రీన్ టైం అయినప్పటికీ బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించి ఆమె ఆకట్టుకుంది.

విలన్ రోల్ లో మిన్నల్ మురళీ నటుడు గురు సోమసుందరం ఆశ్చర్యపరిచారు. తనకి లోకేష్ గ్యాంగ్ కి నడుమ నడిచే సీక్వెన్స్ లు బాగున్నాయి. అలానే లోకేష్ గ్యాంగ్ ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక ఫైనల్ గా సంగీత దర్శకుడు అనిరుద్ కోసం మాట్లాడుకోవాల్సిందే.. తన వర్క్ ఈ సినిమాలోని కంటెంట్ ని క్యారి చేసింది. ఎక్కడికక్కడ సాలిడ్ మూమెంట్స్ తో అనిరుద్ తన మార్కు పాటలు, స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ లో లోకేష్ ఎంట్రీ, వామికాతో కలిసి ఓ సీన్ లో గాడ్ మోడ్ కి తన సంగీతంతో తను తీసుకెళ్లాడు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మెప్పించే అంశాలు చాలానే ఉన్నప్పటికీ కోర్ కాన్సెప్ట్ మాత్రం మనం చూడనిది కాదు కొత్తది కూడా కాదు. సూర్య జై భీమ్ సినిమా స్టైల్ లో పోలీసు అధికారులపై సన్నివేశాలు కనిపించడం కొంచెం రెగ్యులర్ ఫీల్ తీసుకురావచ్చు.

అలాగే హీరో, విలన్ నడుమ ఘర్షణకి బలమైన పాయింట్ ఏంటి అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేసినట్టు కనిపించలేదు. ఎందుకు విలన్ రోల్ హీరో కోసం అంతలా ఆరాటపడుతోంది అనేది ఒక పాయింట్ తర్వాత ప్రశ్నగా మారుతుంది. ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది.

సాంకేతిక వర్గం:

సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు ఇందులో చాలా బాగున్నాయి. చాలా నాచురల్ సెటప్ తో సినిమా తెరకెక్కించారు. అలాగే అనిరుద్ వర్క్ దుమ్ము రేపింది. ముఖేష్ జి కెమెరా వర్క్, ఫ్రేమ్స్ సాలిడ్ గా ఉంది. జీకే ప్రసన్న ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.

ఇక దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ నుంచి డిసి మరో సాలిడ్ వర్క్ అని చెప్పొచ్చు. తను ప్లాన్ చేసుకున్న కథ, కథనాలు ఎంగేజింగ్ గా సాలిడ్ మూమేంట్స్, అంతే వర్కవుట్ అయ్యే మ్యూజిక్ టేస్ట్ తో మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నారు. ప్లాట్ మరీ అంత కొత్తగా ఏం ప్లాన్ చేసుకోలేదు కానీ మిగతా వర్క్ అంతా తన నుంచి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “డిసి” చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్ కి ఇది ఓ బ్యాంగర్ డెబ్యూ. తన రోల్ లో బాగా చేసి ఇంప్రెస్ చేసాడు. అలాగే అనిరుద్ సంగీతం మరో బలంగా ఇందులో నిలిచింది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం కూడా బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా చూసే ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈ చిత్రం థియేటర్లులో మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు