పవన్ ఇకపై సినిమాలకు సైన్ చేయడట..!

పవన్ ఇకపై సినిమాలకు సైన్ చేయడట..!

Published on Apr 13, 2020 1:53 PM IST

Pawan Kalyan

అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా పాలిటిక్స్ కి పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరేమోనని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఐతే వారి ఆశలు తీర్చుతూ పవన్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు సంతోషం పంచారు. ఆయన నుండి ఫస్ట్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి కొత్త చిత్రాలకు సైన్ చేయకూడని నిర్ణయించుకున్నారట. పవన్ కోసం అనేకమంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఆయనను ఒప్పించి సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐతే పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించిన ఒప్పందాలు జరుపకూడని అనుకుంటారట. దానికి కారణం లాక్ డౌన్ అని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. కాబట్టి కొత్త సినిమాలు ఒప్పుకొని లాకై పోతే రాజకీయ కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇబ్బంది కావచ్చని ఆయన ఆలోచనట.

తాజా వార్తలు