‘పంచనామా’తో నా కల నెరవేరింది – ఉదయభాను

‘పంచనామా’తో నా కల నెరవేరింది – ఉదయభాను

Published on Sep 9, 2026 11:00 PM IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ యాంకర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఉదయ భాను ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే, పెళ్లి తర్వాత చాలా అరుదుగా పలు ఈవెంట్స్‌లో, సినిమాల్లో కనిపించిన ఉదయభాను తాజాగా మరో కొత్త అవతారంలోకి మారింది. ఆమె నిర్మాతగా మారుతూ ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ ‘పంచనామా’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 11న ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుండటంతో తాజాగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ..‘15 ఏళ్ల కల నెరవేర్చుకుంటూ నిర్మాతగా మారడం, నా ఆవేదన మరియు శ్రమతో రూపుదిద్దుకున్న ‘పంచనామా’ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11న జీ5లో రాబోతుంది. మిత్రుడు శ్రీరామ్ సాయంతో ‘జీ’ హెడ్ అనురాధను కలిసి కాన్సెప్ట్ ఓకే చేయించుకున్నాను. నటుడు భరత్ కథ నచ్చి డేట్స్ ఇవ్వడంతో పాటు దర్శకుడు మోహన్ శ్రీవత్స, రైటర్ నాగేంద్ర మరియు టీమ్ అంతా కలిసి తక్కువ సమయంలోనే అద్భుతమైన క్వాలిటీతో ఈ సిరీస్‌ను పూర్తి చేశారు. టీవీ రంగం ద్వారానే నాకు గుర్తింపు వచ్చింది.. ఈ సిరీస్ కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందిని ఆశిస్తున్నాను.’ అంటూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.

అంతేగాక.. ‘ నిర్మాతగా మారాలనే నా 15 ఏళ్ల కల నెరవేరుతుండటంతో భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ సిరీస్ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరికీ పేరుపేరున రుణపడి ఉంటాను. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాను.’ అంటూ ఆమె పేర్కొంది.

ఇక ఈ కార్యక్రమంలో హీరో ప్రేమిస్తే భరత్, నిర్మాత విజయేంద్ర మౌళి, డైరెక్టర్ మోహన్ శ్రీవత్స, హీరోయిన్ మేధా రెడ్డి, నటుడు సూర్య శ్రీనివాస్, నటి శ్రీజ తదితరులు మాట్లాడి ఈ వెబ్ సిరీస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు