నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఒకే థియేటర్ చైన్ ద్వారా వేగంగా $150K వసూలు చేసి రికార్డు కొట్టగా, ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారా 1.5 మిలియన్ నుంచి 2 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు టికెట్ ధరల పెంపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా భారీ ధరకు అమ్ముడవ్వడంతో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో స్వల్పంగా రేట్లు పెంచాలని బయ్యర్లు కోరుతున్నారు. అయితే పెంపు వల్ల ప్రభుత్వానికి చెల్లించే రుసుములు, జీఎస్టీ మినహాయింపులు పోను నిర్మాతలకు పెద్దగా లాభం ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
దీంతో ఈ విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకునేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాతో నాని మరోసారి తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


