2020 టాలీవుడ్ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. కరోనా రూపంలో ఈ ఏడాది చిత్ర పరిశ్రమను కుదేలు చేసింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో భారీ వసూళ్లతో అద్భుతమైన ఆరంభం దొరికింది. ఇదే ఊపుతో టాలీవుడ్ విజయపథంలో దూసుకువెళుతుందని అందరూ భావించారు. ఆ ఆశలన్నిటి పై లాక్ డౌన్ నీళ్లు చల్లింది. సినిమాలు విడుదల మరియు చిత్రీకరణ ఆగిపోయింది.
కాగా ఈ ఏడాదికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురంలో ఉంది. బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది. ఇక స్టార్ హీరోల చిత్రాలన్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడగా…ఆ స్థాయి వసూళ్లు సాధించే చిత్రాల విడుదల లేకుండా పోయింది. పవన్ వకీల్ సాబ్ మాత్రమే ఈ ఏడాది విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా విడుదల అవుతుందన్న గ్యారంటీ లేదు, కాబట్టి ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లు సాధించిన రికార్డు బన్నీదే అయ్యే అవకాశం కలదు.


