టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సస్పెన్స్ డ్రామా !

టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సస్పెన్స్ డ్రామా !

Published on Jul 21, 2020 1:50 AM IST

హీరో నితిన్ పెళ్లి ఈ నెల 26న రాత్రి 8 గంటలకు జరగబోతుంది. ఇక సినిమాల విషయనికి వస్తే నితిన్ ఇప్పటికే వరుస సినిమాల్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందువరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కాకుండా టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడు నితిన్. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఈ సినిమా కూడా మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ డ్రామాగా సినిమా ఉంటుందట. పైగా ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఇక నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అయింది. దాంతో నితిన్, ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టారు. మరి ఈ యేలేటి చిత్రంతో కూడా నితిన్ మరో సూపర్ హిట్ ఆయనకు దక్కుతుందేమో చూడాలి. అన్నట్టు ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్.

తాజా వార్తలు