ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో, యంగ్ హీరో విశ్వక్ సేన్ కేవలం 36 రోజుల వ్యవధిలో ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో రూపొందిన ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా దాదాపు ఖరారయ్యాయి.
అక్టోబర్ 30న స్వీయ దర్శకత్వంలో వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘కల్ట్’, నవంబర్ 19న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’, డిసెంబర్ 4న సాయికిరణ్ రెడ్డి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ‘లెగసీ’ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఇటీవల వచ్చిన ‘లైలా’, ‘ఫంకీ’ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సాలిడ్ కంబ్యాక్ కోసం విశ్వక్ సేన్ ఈ విభిన్నమైన సబ్జెక్టులను ఎంచుకున్నాడు. బయటి ఈవెంట్లకు దూరంగా ఉంటూ పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టిన విశ్వక్, ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ మూడు డిఫరెంట్ జానర్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఈ ట్రిపుల్ రిలీజుల్లో ఏ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ బ్రేక్ ఇస్తుందో చూడాలి.


