దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకు నో చెప్పిన స్వీటీ.?

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకు నో చెప్పిన స్వీటీ.?

Published on Aug 1, 2020 2:11 AM IST

Anushka Shetty 1
మన దక్షిణాదిలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే మొదట గుర్తుకొచ్చే సూపర్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క. ఎలాంటి హడావుడి లేకుండానే అనుష్క తన సినిమాలను చేసుకుంటూ వెళ్తుంది. గత ఏడాది నుంచి అయితే అసలే సైలెంట్ అయ్యిపోయింది.

తాను నటించిన లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం” ఇంకా విడుదలకు రెడీగా ఉండగా ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ “నెట్ ఫ్లిక్స్” అనుష్కతో ఒక వెబ్ సిరీస్ చేసేందుకు ముందుకొచ్చారట. దీనికి గాను భారీ ప్రైస్ నే ఆఫర్ చేసినప్పటికీ స్వీటీ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం తనకి వెబ్ సిరీస్ లలో నటించాలన్న ఆసక్తి లేదని నో చెప్పారట. అయితే నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ ను భారీ గానే తియ్యాలని ప్లాన్ చేశారట. అందులోనూ అన్ని కీలక భాషల్లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి అనుష్క ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు