బాహుబలి చిత్రాలు ప్రభాస్ ఇమేజ్ ఆకాశానికి చేర్చాయి. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకున్నటున్న స్టార్ హీరో. సాహో హిట్ తరువాత ఆయన పాన్ ఇండియా ఇమేజ్ గాలివాటం కాదని, ఆయనకు స్ట్రాంగ్ ఫ్యాన్స్ బేస్ బాలీవుడ్ లో ఏర్పడిందని నిరూపితం అయ్యింది. ఇక ప్రభాస్ మూవీ అంటే అది పాన్ ఇండియా చిత్రమే. దర్శకనిర్మాతలకు కూడా భారీ బడ్జెట్ మూవీ అంటే ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ మాత్రమే.
దానికి కారణం వందల కోట్లు వసూళ్లు కేవలం ప్రభాస్ కే సాధ్యం అని నిర్మాతలు నమ్ముతున్నారు. బ్యాడ్ టాక్ తెచ్చుకొని కూడా సాహో మూవీ 420కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మరే హీరోకి లేని ఈ ప్రత్యేకత ప్రభాస్ కి ఉంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మా హీరోకి సాటిలేరంటూ పొంగిపోతున్నారు. వచ్చే ఏడాది టాలీవుడ్ నుండి స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఎంతమంది సక్సెస్ అవవుతారో చూడాలి.


