ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న తాజా సినిమా ‘రెడ్’. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ లుక్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సర్ ప్రైజ్ చేస్తోందని.. లవర్ బాయ్ లా కనిపించే రామ్.. రెడ్ ప్రీ క్లైమాక్స్ లో మాత్రం ఊర మాస్ లుక్ లో పర్ఫెక్ట్ బాడీతో మెస్మరైజ్ చేస్తాడని.. మునుపెన్నడు చూడని విధంగా రామ్ డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నాడని తెలుస్తోంది.
ఇక మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తోన్నా.. చిత్రబృందం ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసింది. ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ కూడా ఆ మధ్య స్పష్టం చేశారు. కాగా ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు.