రామ్ ‘రెడ్’ ఇక సంక్రాంతికేనా ?

రామ్ ‘రెడ్’ ఇక సంక్రాంతికేనా ?

Published on Aug 25, 2020 1:06 AM IST

red
ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల రిలీజ్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలే మొత్తం పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇప్పుడు దసరా సీజన్ కూడా పోవడంతో ఇక చేసేది ఏమిలేక స్టార్ హీరోలు కూడా నేరుగా డిజిటల్ రిలీజ్ కి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే నాని ‘వి’, సూర్య ‘ఆకాశమే హద్దుగా’ లాంటి సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. కానీ రామ్ మాత్రం తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఎదురుచూస్తున్నాడు.

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. సంక్రాంతికి అన్ని కుదిరితే నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు