పిక్ టాక్ : డార్లింగ్ తో సంతోష్ శోభన్ స్పెషల్ మూమెంట్..!

పిక్ టాక్ : డార్లింగ్ తో సంతోష్ శోభన్ స్పెషల్ మూమెంట్..!

Published on Feb 20, 2026 9:00 AM IST

Prabhas

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిన్న సినిమాను చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, (Prabhas) చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించి, యంగ్ టీమ్‌తో సరదాగా గడిపిన ప్రభాస్, (Prabhas) సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

​ఈ సందర్భంగా ప్రభాస్‌ను కలిసిన సంతోష్ శోభన్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్రభాస్‌ను ఆత్మీయంగా హత్తుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, మొదటి నుండి తనకు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వీడియో ఈరోజే విడుదల కానుంది.

​ఇక ఈ సినిమా సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఇదే దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, మానస వారణాసి మరోసారి జంటగా నటించబోతున్నారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు