మన టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా కూడా మారిన సంగతి తెలిసిందే. తాను హీరోగా బలగం దర్శకుడు వేణు యెల్దండి కలయికలో చేస్తున్న సాలిడ్ సబ్జెక్టునే ‘ఎల్లమ్మ’. అనౌన్సమెంట్ గ్లింప్స్ తోనే తనకిది పవర్ఫుల్ డెబ్యూ అన్నట్టుగా ఒక క్లియర్ కట్ సందేశాన్ని తాను ఇచ్చేసారు.
ఇక ఈ సినిమా కోసం తన వర్కింగ్ డేస్ కోసం దేవి చేసిన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న నిర్మాత దిల్ రాజు తనతో ఈ సినిమాకి నెలలో కేవలం పది రోజులు కేటాయిస్తే చాలని చెప్పినట్టు దేవి తెలిపారు. మిగతా రోజులు మీ ఇతర సినిమాల సంగీతం పనులు చూసుకోమని తనకి ఈ 10 రోజులు షూటింగ్ కి ఇస్తే చాలు అన్నట్టు తెలిపారట.
ఈ కారణం తనకి మరింత నచ్చడంతో ఈ సినిమాకి మెయిన్ గా ఓకే చెప్పడం జరిగింది అని రివీల్ చేశారు. దీనితో దేవీ రెండు పనులు బ్యాలన్స్ చేసుకుంటూ కెరీర్ ని మరింత కేర్ గా నడిపిస్తున్నారని చెప్పాలి. మరి తన డెబ్యూలో పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


