కొత్తదనం కావాలంటున్న బాలయ్య !

కొత్తదనం కావాలంటున్న బాలయ్య !

Published on Oct 12, 2020 9:07 PM IST

Balakrishna2
యువరత్న నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే.. యాక్షన్, అయితే ఇక నుండి బాలయ్య సినిమాలు ఆయన అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. బాలయ్య తన సినిమాల శైలిని మార్చబోతున్నాడట. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందని, ఇక నుండి బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు స్పష్టం చేశాడట.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారు బోయపాటి. అందుకే బాలయ్య సినిమాలో గుండు లుక్ లో కనిపించబోతున్నాడు. మొత్తానికి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. మరి బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు