బాలీవుడ్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో కత్రినా కైఫ్ కూడా ఒకరు. ఇప్పుడు పర్శనల్ లైఫ్ లోనే ఆమె బిజీగా ఉన్నారు. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలతో మన ఆడియెన్స్ కి కూడా ఆమె ఇప్పటికీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. అయితే బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో వివాహం తర్వాత కత్రినాకైఫ్ మళ్లీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆమెని చూసినవారు అంతా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు ఎంతో నాజూగ్గా కనిపించి సినిమాల్లో అలరించిన కత్రినా ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోవడంతో సోషల్ మీడియాలో తన కొత్త లుక్ కోసం నెటీజన్స్ నడుమ చర్చ మొదలైంది. అయితే కత్రినా ఇప్పుడు పిల్లలు, కుటుంబం తో బిజీగా వుంది. పైగా ఆమె వయస్సు కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. సో ఇవన్నీ సాధారణమే కానీ ఓ స్టార్ హీరోయిన్ ని సడెన్ గా ఈ రేంజ్ ఛేంజ్ లో చూసేసరికి అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.


