దేవరకొండ తమ్ముడు బాగానే లాగాడు

దేవరకొండ తమ్ముడు బాగానే లాగాడు

Published on Oct 13, 2020 1:07 AM IST

middle class
కటెంట్ బాగుంటే పెద్ద మొత్తం చెల్లించైనా సినుమా హక్కులను కొనడానిక వెనుకాడటంలేదు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఇప్పటికే ‘వి, నిశ్శబ్దం’ లాంటి చిత్రాలను రిలీజ్ చేసిన అమెజాన్ ఇంకో తొమ్మిది సినిమాల వరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వాటిలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రం కూడ ఉంది. ఈ చిత్రాన్ని సుమారు రూ.4.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి అమెజాన్ సంస్థ కొనుగోలు చేసిందట. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవడం అంటే విశేషమే అనాలి.

ఈ ఒప్పందంతో చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ మంచి ప్రాఫిట్స్ చూసే అవకాశం ఉంది. ఆనంద్ మినహా దాదాపు మిగతా అందరూ కొత్త వాళ్లే నటించిన ఈ సినిమాకు ఇంత మంచి డీల్ రావడంతో ఓటీటీ వీక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇకపోతే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు డైరెక్ట్ చేశారు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన ‘బిగిల్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ కథానాయకిగా నటించడం జరిగింది. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ నందు ఈ చిత్రం రిలీజ్ కానుంది.

తాజా వార్తలు