చరణ్ ఈ లెజెండరీ డైరెక్టర్ తో..ఛాన్స్ ఉందా?

చరణ్ ఈ లెజెండరీ డైరెక్టర్ తో..ఛాన్స్ ఉందా?

Published on Oct 13, 2020 7:02 AM IST

Ram Charan1

మన టాలీవుడ్ కొన్ని కొన్ని కాంబినేషన్ లు అంటే ఎందుకో ఎనలేని ప్రీతి. కొన్ని రిపీటెడ్ కాంబోలకు ఉంటే మరికొన్ని ఒక స్టార్ హీరోతో మరో స్టార్ దర్శకుడు ఇలా చాలా రకాల లెక్కలే ఉంటాయి. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ కాంబో కోసమే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కొన్ని మరపు రాణి అదిరిపోయే హిట్స్ ను అందించిన లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఒక వండర్ లాంటి చిత్రం పడితే చూడాలని మెగా ఫాన్స్ సహా టాలీవుడ్ ఫిల్మీ లవర్స్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఎందుకో ఇపుడు ఈ కాంబో కోసం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇందుకు కారణం ఇటీవలే దర్శకేంద్రుడు తన కం బ్యాక్ చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడమే అని చెప్పాలి. ఇంకా హీరో ఫిక్స్ కానీ ఆ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనితో ఇదే సమయంలో రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా ఉందని అభిమానులే అనేసుకుంటున్నారు. మరి ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.

తాజా వార్తలు