ఆ స్టార్ హీరోతో త్రిష పెళ్లి..? సమాధానం ఇవ్వని హీరో తండ్రి

ఆ స్టార్ హీరోతో త్రిష పెళ్లి..? సమాధానం ఇవ్వని హీరో తండ్రి

Published on Oct 16, 2020 12:10 AM IST

TRISHA
తమిళ సినీ పరిశ్రమలో కొన్ని రోజులుగా ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే స్టార్ హీరోయిన్ త్రిష, ప్రముఖ హీరో శింబుల వివాహం. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే ఇలాంటి ప్రచారం జరిగునప్పడు అది అబద్దమైతే హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు వాటిని ఖండిస్తారు. కానీ ఇప్పటివరకు శింబు, త్రిషలు ఆ పని చేయలేదు. దీంతో ప్రేక్షకుల్లో అనుమానాలు బలపడ్డాయి.

తాజాగా శింబు తండ్రి టి.రాజేందర్ సైతం ఈ ప్రచారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు. త్వరలో తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికలు జరిగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంలోనే విలేఖరి ఒకరు త్రిష, శింబుల పెళ్లి వార్తలపై మీ స్పందన ఏమిటని అడగ్గా రాజేందర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను దాటవేశారు. దీంతో శింబు, త్రిష అభిమానులు రాజేందర్ పుకార్ల మీద స్పందించడం ఇష్టం లేక ఊరుకున్నారా లేకపోతే నిజంగానే వారిద్దరూ వివాహం చేసుకోనున్నారా అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు