ఆల్రెడీ కౌంట్ డౌన్ సెట్ చేసుకున్న తారక్ ఫ్యాన్స్.!

ఆల్రెడీ కౌంట్ డౌన్ సెట్ చేసుకున్న తారక్ ఫ్యాన్స్.!

Published on Oct 16, 2020 7:07 AM IST

NTR

మళ్లీ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమాలో ఓ రేంజ్ రచ్చ కు రంగం సిద్ధం అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి తారక్ పై డిజైన్ చేసిన టీజర్ కోసం రంగం సిద్ధమైంది.

దీనిని మాత్రం తారక్ ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్క రికార్డ్స్ పరంగా మాత్రమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ లో కౌంట్ డౌన్ ను కూడా పెట్టేసుకున్నారు. జక్కన చెప్పిన అక్టోబర్ 22కు రోజులు లెక్కేసుకుంటున్నారు.

దాదాపు రెండు సంవత్సరాల నిరీక్షణకు ఇప్పుడు తెర పడుతుండడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తాము పెట్టుకున్న అంచనాలు చెప్పుకోలేని విధంగా పెట్టుకున్నారు. అందుకే ప్రతీ రోజును ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వీళ్లంతా కరెక్ట్ గానే ఉన్నారు, ఇక సిసలైన టాస్క్ అంతా జక్కన్న ఎలాంటి ఫీస్ట్ ఇస్తారు అన్న దాని మీదనే ఆధార పడి ఉంది.

తాజా వార్తలు