చిరు, బాలయ్య మల్టీస్టారర్ సమయం కూడా వచ్చిందా?

చిరు, బాలయ్య మల్టీస్టారర్ సమయం కూడా వచ్చిందా?

Published on Feb 22, 2026 9:01 PM IST

Chiru-X-Balayya

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో పాటుగా భారీ మల్టీస్టారర్ సినిమాల హవా కూడా నడుస్తుంది. అటు బాలీవుడ్, మోలీవుడ్ రీసెంట్ గా కన్నడ సినిమా నుంచి కూడా సీనియర్ స్టార్స్ కలయికలో సినిమాలు వచ్చాయి. ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో మెగాస్టార్, వెంకీ మామ కూడా కనిపించారు కానీ వెంకీ మామ రోల్ కేవలం గెస్ట్ రోల్ వరకు మాత్రమే పరిమితం అని అందరికీ తెలిసిందే.

కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ స్టార్స్ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల కలయికలో సాలిడ్ మల్టీస్టారర్ అనౌన్స్ అయ్యింది. అంతే కాకుండా ఇంకోపక్క మలయాళ సినిమా నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి కలయికలో కూడా ఓ సినిమా రాబోతుంది. వీటితో మన తెలుగు సినిమా నుంచి కూడా ఒక ఐకానిక్ మల్టీస్టారర్ పడాలని అభిమానులు గట్టిగా ఇప్పుడు కోరుకుంటున్నారు.

మరి అలాంటి ఐకానిక్ మల్టీస్టారర్, బాక్సాఫీస్ దగ్గర ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న కాంబినేషన్ అంటే మెగా అండ్ నందమూరి కాంబినేషన్ అనే అంతా చెబుతారు. ఆ మధ్య మెగాస్టార్, ఇంకా బాలయ్య ఓ ఫంక్షన్ లో తమ మల్టీస్టారర్ కోసం సిద్ధం అని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ క్లిప్ లు అన్నీ మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. ఎలాగో ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సీనియర్ హీరోల కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమాలు ర్యాంపేజ్ మొదలవుతుంది.

ఇదే ఊపులో మన నుంచి కూడా చిరు, బాలయ్య సినిమా కూడా మొదలైతే పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ ఉంది అని చిన్న హింట్ వచ్చినా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తగలబడిపోతాయ్. మరి ఈ ఇద్దరి చరిష్మాని హ్యాండిల్ చేసే ఆ సమర్ధవంతమైన దర్శకుడు ఎవరు అనేది పెద్ద ప్రశ్న. సో అది క్లియర్ అయితే డెఫినెట్ గా ఈ సినిమా ముందుకు వెళుతుంది. మరి ఇదెప్పుడు సాధ్యం అవుతుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు