అట్టహాసంగా ‘జై హనుమాన్’ మొదలు.. ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసిన తేజ సజ్జ

అట్టహాసంగా ‘జై హనుమాన్’ మొదలు.. ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసిన తేజ సజ్జ

Published on Feb 22, 2026 5:11 PM IST

Jai Hanuman

మన తెలుగు సినిమా నుంచి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన మొదటి సూపర్ హీరో చిత్రమే “హను మాన్”. దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ కలయికలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపింది. సంక్రాంతి బరిలో అప్పటికి రికార్డు గ్రాసర్ గా కూడా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ “జై హనుమాన్” ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఎట్టకేలకి ఆ సమయం రానే వచ్చింది.

నేడు రిషబ్ శెట్టి, బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్ అలాగే అనిల్ తడానీ ఇంకా మైత్రి నిర్మాతల కలయికలో అంజనాద్రి, హంపీలో ఎంతో అట్టహాసంగా, పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో హను మాన్ హీరోలు తేజ సజ్జ, రిషబ్ శెట్టితో పాటుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా పాల్గొనడం జరిగింది.

అయితే ఇందులో భూషణ్ కుమార్ ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టగా అనీల్ తడానీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఈ ఫస్ట్ షాట్ ని తమ సూపర్ హీరో తేజ సజ్జ దర్శకత్వం వహించినట్టు మైత్రి వారు తెలిపారు. ఇలా ఎట్టకేలకి ఈ అవైటెడ్ సీక్వెల్ సినిమా మొదలైంది. మరి ఎప్పటికి పూర్తయ్యి రిలీజ్ కి వస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు