మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో నాగ శౌర్య.!

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో నాగ శౌర్య.!

Published on Oct 16, 2020 9:18 AM IST

మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. తన మొదటి సినిమా నుంచి కూడా ఫలితంతో సంబంధం లేకుండా కొత్త సబ్జెక్ట్ నే టచ్ చెయ్యడానికి ప్రయత్నించాడు. అలా మంచి విజయాలను కూడా అందుకున్న ఈ యంగ్ యాక్టర్ ఇప్పుడొక సాలిడ్ ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను ఓకె చేసేసాడు.

టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ తో నాగశౌర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను చెయ్యడం ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఎక్స్ క్లూజివ్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. అయితే నాగశౌర్య ఇప్పుడు ఒక స్ట్రాంగ్ సబ్జెక్టు తో కూడిన స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుండగా ఈ చిత్రం దానికి పూర్తి భిన్నంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు.

అలాగే ఈ చిత్రానికి ఇంతకు ముందు నాగ శౌర్య కు సెన్సేషనల్ హిట్ ఆల్బమ్ “ఛలో” ని ఇచ్చిన సాగర్ మహతి సంగీతం అందించనుండడం మరి ఆసక్తికర అంశం. ఉషా మల్పూరి నిర్మాతగా వహిస్తున్న ఈ చిత్రం షూట్ ఎప్పుడు మొదలు కానుంది అలాగే క్యాస్టింగ్ విషయాలు తొందరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు