‘ది ప్యారడైజ్’ టూర్‌తో జడల్ జమానా షురూ.. ఏ రోజు ఎక్కడ అంటే..?

‘ది ప్యారడైజ్’ టూర్‌తో జడల్ జమానా షురూ.. ఏ రోజు ఎక్కడ అంటే..?

Published on Sep 16, 2026 8:03 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

ఈ సినిమాను సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ చేయనుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ టూర్‌ను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.ఈ ప్రమోషనల్ టూర్‌ను సెప్టెంబర్ 17న చెన్నై, 18న బెంగళూరు, 19న కొచ్చి మరియు 21న హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిత్ర యూనిట్ పర్యటించనుంది.

ఈ ప్రమోషనల్ టూర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు