మన తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఇండియన్ సినిమాను ఏలుతున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలితో వచ్చిన స్టార్డం ను అలా నిలుపుకొని ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా నిలిచాడు. అలా ఇప్పుడు ప్రభాస్ తో బాలీవుడ్ బడా నిర్మాతలు అంతా సినిమా చెయ్యాలని అతని డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఒకదాన్ని మించిన ఒకటి ప్రాజెక్టులలో భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.
బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్రకు గాను గత కొన్నాళ్లుగా మంచి సస్పెన్స్ నెలకొంది.అలా ఎందరో స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఈ చిత్రం ప్రభాస్ సరసన ఫిక్స్ అయ్యిపోయినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.
ఆమె మరెవరో కాదు మన టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన టాల్ హీరోయిన్ కృతి సనన్. ఈమెనే ప్రభాస్ కు సరసం మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.ఈ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ కంటే మించి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే 3డి లో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.


