సంక్రాంతికి రెడ్ రిలీజ్ ఫిక్స్ అయినట్లే !

సంక్రాంతికి రెడ్ రిలీజ్ ఫిక్స్ అయినట్లే !

Published on Nov 1, 2020 11:21 PM IST

RED

హీరో రామ్ తన రెడ్ సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ పట్టు పట్టినట్లు ఉన్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు.

అయితే సంక్రాంతికి అన్ని కుదిరితే నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్. కాగా సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తోంది. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

తాజా వార్తలు