‘రణబాలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్..!

‘రణబాలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్..!

Published on Sep 17, 2026 2:05 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ చిత్రం ‘రణబలి’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పనులు నేటితో పూర్తయ్యాయి. దీంతో అనుకున్న సమయానికే సినిమా విడుదల కావడం ఖాయమని స్పష్టమైంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో పాటు దసరా సెలవుల సీజన్ కావడంతో విజయ్ బాక్సాఫీస్ వద్ద తిరిగి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో విలన్‌గా పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్లను శరవేగంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు