ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వండర్ లవ్ స్టోరీపై ఇప్పుడు మేకర్స్ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుస అప్డేట్స్ తో అంతకు ముందున్న అంచనాలు వేరు ఇక్కడ నుంచి మొదలైన అంచనాలు వేరు అన్నట్టుగా చేసారు.
ఇక ఈ సినిమాలో మిగిలి ఉన్న క్లైమాక్స్ పార్ట్ పై చిత్ర యూనిట్ కంప్లీట్ గా దృష్టి పెట్టనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ క్లైమాక్స్ పైన మరియు సినిమా స్టోరీ విషయంలో మేకర్స్ చాలా నమ్మకంగా ముక్తకంఠంతో ఒకే మాట చెబుతున్నారు. ఇండియన్ స్క్రీన్ పైనే రాధే శ్యామ్ లాంటి స్టోరీ ఎన్నడూ చూడనిది అని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో విడుదల వరకు ఆగక తప్పదు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


