నాని ‘బ్లడీ రోమియో’ పై లేటెస్ట్ బజ్! ఎక్కువ గ్యాప్ వద్దంటున్న నాని?

నాని ‘బ్లడీ రోమియో’ పై లేటెస్ట్ బజ్! ఎక్కువ గ్యాప్ వద్దంటున్న నాని?

Published on Sep 17, 2026 10:01 AM IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్ గ్రాండ్ గా విడుదలకి రాబోతోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి నాని ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఇంత చేసినప్పటికీ ఎలాంటి రెస్ట్ లేకుండానే నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

నెక్స్ట్ యువ దర్శకుడు సుజీత్ తో క్రేజీ యాక్షన్ చిత్రం బ్లడీ రోమియో చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై మంచి హైప్ కూడా ఉంది. ఇక ఈ సినిమాని నాని ఈ అక్టోబర్ లోనే పట్టాలెక్కించనున్నాడు అని టాక్. సో ఇలా ప్యారడైజ్ విడుదల అలా బ్లడీ రోమియో ఆరంభం కావడానికి ఎక్కువ గ్యాప్ వద్దని అంటున్నాడని చెప్పొచ్చు. సో మొత్తానికి నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా అతి త్వరలోనే మొదలు కాబోతోంది.

తాజా వార్తలు