శేష్ సినిమాలో జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడా.?

శేష్ సినిమాలో జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడా.?

Published on Dec 6, 2020 10:00 AM IST

Adivi Sesh

మన టాలీవుడ్ లో తనదైన సినిమాలతో హాలీవుడ్ లెవెల్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తూ ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఇప్పుడు తన మనసుకు ఎంతో దగ్గరైన సినిమాను చేస్తున్నాడు. అదే “మేజర్ ది ఫిల్మ్”. ఈ మధ్య అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది అన్న విషయాన్ని తెలుపుతూ ఒక ఇన్స్పైరింగ్ వీడియోను విడుదల చేసాడు. అయితే ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి ఒక ఊహించని గాసిప్ చక్కర్లు కొడుతుంది.

అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు జూనియర్ పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ చిత్రంలో చిన్న క్యామియో రోల్ లో కనిపిస్తాడని. అలాగే ఇందులో మేజర్ ఉన్ని కృష్ణన్ చిన్నప్పటి రోల్ లో అఖీరా కనిపిస్తాడని టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే ఆ మధ్య అఖీరా మరియు శేష్ లు కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. మరి బహుశా వారి కలయిక అందుకే కావచ్చు ఏమో కానీ దీనిపై ఖచ్చితమైన సమాచారం అయితే ఇంకా రాలేదు.

తాజా వార్తలు